Global Secretary Smt. Shwetha Ganjam, A.M. Global Secretary, +91 8310355276
Menu
Komalamma Peetam
వాసవీ ఫౌండేషన్ సేవలో – కోమలమ్మ స్మృతి పీఠం
తిరుపతి కాలి బాట (అలిపిరి) వద్ద పాదాల మండపానికి వెళ్ళటానికి తొలి గడప దగ్గర స్వామివారికి ఎదురుగా నిలబడి వున్న ఆర్యవైశ్య వనిత ఈ కోమలమ్మ. వీరు వంద సంవత్సరాల క్రింత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, స్థానిక ఆలయాలకి పుష్ప కైంకర్యంతో పాటు నడిచి వెళ్ళే యాత్రికులకు నిత్యాన్నదాన కార్యక్రమం చేయటానికి నడిచి వెళ్ళే మార్గంలో ఒక సత్రాన్ని కట్టించి అందులో రకరకాల పుష్పాలను పండించి స్థానిక ఆలయాలకు, నడిచి వెళ్ళే యాత్రికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తన భక్తి తత్పరతను చాటుకున్నారు. అ తరువాత పాదాలమండపానికి సమీపంలోనే స్వామి వారి సన్నిథిని చేరుకున్నారు. దానికి గుర్తుగా ఆమె విగ్రహాన్ని తి.తి.దే. వారు నడక దారిన తొలి మెట్టు దగ్గర ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
వయసు మీరిన పిదప ఆ సత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించిన తరువాత అప్పటి మహంతు ప్రయాగదాసు కోరిక మీర తమ సత్ర ప్రాంగణంలో స్వామివారికి ఆస్థానం ఏడాదికి ఒకసారి నిర్వహించాలని కోరగా ఇప్పటికీ ఆమె కోరిక మేర ఆ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం రోజున గజవాహనం పైన అమ్మవారికి సారెతో పాటు విచ్చేసి ఈ ప్రాంగణంలో ఆస్థానం నిర్వహించబడుతుంది.
ఈ సంఘటన తెలుసుకున్న తరువాత తరతరాలుగా ఆర్యవైశ్యులు అన్ని ప్రాంతాలలో సత్రాలు, ఆలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు కట్టి ప్రజాపయోగ కార్యక్రమాలు అనేకం చేసారు. వారిలో చాలా మంది చరిత్ర పుటలలో మిగిలిపోగా వారి వారసులలో ఎవరో కొద్ది మంది తప్ప చాలామంది సమాజంలో ఎటువంటి గుర్తింపును పొందలేక పోతున్నారు.
అందువల్ల వాసవీ ఫౌండేషన్ తమ సమాజ సేవలో భాగంగా, ఎవరైతే గుడి, బడి, సత్రాలవంటి సమాజ కార్యక్రమం చేసారో, వారిని కాని, వారి వారసులను కాని వారి వారి ప్రాంతాలలో కాని, తిరుపతిలో కాని సన్మానించి తగురీతిని గౌరవించి పత్రికలోను, వెబ్ సైట్ ద్వారా వారి ఉనికిని ముందు తరాల కోసం భద్రపరచాలని నిర్ణయించాము.
దీనికి గాను కార్యాచరణ కమిటి సభ్యులుగా ఈ క్రింది వారు స్వయంగాపాల్గొన టానికి అంగీక రించారు. వారి సూచనల మీద వాసవీ ఫౌండేషన్ వెబ్ సైటులో కోమలమ్మ స్మృతి పీఠం తరపున యావన్మంది మీకు తెలిసిన సదరు ధార్మిక పరుల వివరాలను వారి ద్వారా ఇందులో పొందు పరచిన అప్లికేషన్ పూర్తిచేసి మాకు మెయిల్ చేయవలసినదిగా కోరటమైనది.
ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి, కార్యాచరణకు తమ తమ సహకారాన్ని అందచేయవలసినదిగా కోరటమైనది.
ఈ విభాగానికి క్షేత్రస్థాయి కమిటీ సభ్యులు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు ఉంటారు. జిల్లా స్థాయి కమిటీ సభ్యులు సూచించిన వారికి వారి వారి జిల్లాలలో ఆయా జిల్లా ప్రముఖుల సమక్షములో తగురీతిన సన్మానించి వారి పూర్వికులు చేసిన సమాజ సేవలు ముందు తరాలకు ఆదర్శవంతంగా వుండాలని తెలియచేస్తూ స్థానిక మీడియా ద్వారా తగిన గుర్తింపును తీసుకు రావాలనేదే ఈ స్మృతి పీఠం ఆశయం.