Global Secretary Smt. Shwetha Ganjam, A.M. Global Secretary, +91 8310355276
Menu
Application for Temple Umbrellas / Idols
ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన వాసవీ ఆలయాలకు ఒక వినూత్న అవకాశం. మన దక్షిణ భారత దేశంలో దాదాపు 4 వేల వాసవీ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నగర, పట్టణ ప్రాంతాలలో మరికొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. అయితే దాదాపు అన్ని ఆలయాలలో తిరుమల ఆలయంలో స్వామి వారి ఉత్సవాలలో కనిపించే గొడుగులను ప్రతి అమ్మవారి ఆలయాలకు సమర్పించాలని వాసవీ ఫౌండేషన్ నిర్ణయించింది. దానికి గాను గొడుగులు కావలసిన వారు మీమీ ప్రాంతాలలో 5గురు సభ్యులతో కూడిన వాసవీ ఫౌండేషన్ టీంగా ఏర్పడితే వారిద్వారా గొడుగులను సమర్పించటం జరుగుతుంది. దానికి గాను పట్టణ, నగర ప్రాంతాలవారికి కొంత సాయం, గ్రామీణ ప్రాంతాల వారికి పూర్తిగా ఉచితంగా కూడా ఇవ్వటం జరుగుతుంది. కావలసిన వారు ఈ క్రింద ధరఖాస్తును ఆన్ లైన్ లో పూర్తి చేసి పంపితే తగిన సమయంలో దరఖాస్తు దారుని ఆలయానికి చేర్చటం జరుగుతుంది. తదుపరి మా వాసవీ ఫౌండేషన్ టీం సభ్యులచేత ఆలయానికి గొడుగు ఒకటి కాని రెండు కాని మీమీ సహకారాన్ని బట్టి అందచేయటం జరుగుతుంది. వివరాలకు 9160053535 సంప్రదించండి.