విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ కిట్టి సభ్యుల సహాయ సహకారాలతో కొత్తపేట స్వర్గధామానికి 25 వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది. వాసవి ఫౌండేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు మండవల్లి వెంకటరాజు సెక్రటరీ వెంకట సత్యనారాయణ (ఏడుకొండలు) గూడూరు నర్సింగ్ రావు, పులిపాటి వెంకట రామారావు, వజ్రపు కృష్ణారావు శాఖ వెంకటగుప్త శాఖ సుబ్బారావు, మండవల్లి సత్యనారాయణ తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ చెన్న బుచ్చి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేసు వేంకట సుబ్బారావు, తిరుపతి, వ్యవస్థాపక గ్లోబల్ కార్యదర్శి శ్రీమతి శ్వేత గంజాం అభినందనలు తెలియచేసారు.


