వాసవీ ఫౌండేషన్, కర్ణాటక, బాగేపల్లి మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో విశ్వ మాత వాసవీ ఆలయంలో విశ్వకళ్యాణం కోసం, సకల జనుల సౌభాగ్య, సిరి సంపదల కోసం 90 మంది మహిళలతో వైభవ లక్ష్మీ వ్రతం జరిగింది. ఈ వ్రతానికి కావాలసిన పూజా సామగ్రిని మొత్తం వాసవీ ఫౌండేషన్ చేత నిర్వహించబడింది. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలలో ఆర్యవైశ్యులెప్పుడూ ముందే వుంటారు అని స్థానికులు, పలువురు స్థానిక పెద్దలు అభినందించారు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇటువంటి భక్తి చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని వాసవీ ఫౌండేషన్ నిర్వాహకులు కోరుతున్నారు.



