మాన్యులు శ్రీ పత్తి సీతారామయ్య గారు, బెంగళూరు వాస్తవ్యులు, వాసవీ నిత్యాన్న సేవా ట్రస్టు వ్యవస్థాపకులు నిన్న మన వాసవీ ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేసి, శ్రీవారి సన్నిథిలోని ఉద్యోగులకు రానున్న ఉగాది సందర్భంగా వస్త్ర బహుమాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారామయ్యగారిని కూడా మన ఫౌండేషన్ తరపున ఇతోధికంగా చిరు సన్మానం చేయటం జరిగింది. దానికి ప్రతిగా వారు మన ఫౌండేషన్ కు విరాళాన్ని అందజేసారు. వీరితో పాటు తిరుమల శ్రీపాదరాజ మఠం నిర్వహించే అతిథి గృహ నిర్మాణాన్ని, అలాగే, మన ఆర్యవైశ్య మహిళ శ్రీమతి కోమలమ్మ విగ్రహాన్ని దర్శించటం జరిగింది.











