తిరుపతి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ గూడూరు కిషోర్ కుమార్ గారికి స్వాగతం పలికిన గూడూరు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ సోమిశెట్టి చెంచురామయ్య గారు, ఆర్యవైశ్య సంఘం
అధ్యక్షులు కోట రామారావు గారు మరియు వారి పాలకమండలి సభ్యులు.
08-10-2024 మంగళవారం
గూడూరులో శరన్నవరాత్రుల్లో భాగంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వారాహి మాత అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ను దర్శించుకుని వారి యొక్క ఆతిధ్యాన్ని స్వీకరించి,
అక్కడి నుండి నెల్లూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధనలక్ష్మి అలంకారంలో ఉన్న శ్రీ వాసవి మాత ని దర్శించడం జరిగింది.
ఆలయ కమిటీ అధ్యక్షులు కోట గురుబ్రహ్మం గారు, కొండ ప్రవీణ్ శంకర్ గారు, షణ్ముఖ రావు గారు మరియు వారి కార్యవర్గం* ఆలయ మర్యాదలతో సత్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గాధంశెట్టి నాగరాజు గారు మరియు గూడూర్ కిరణ్ కుమార్ గారు, దోర్నాదుల మధు గారు మరియు ఆర్యవైశ్య మహాసభ తిరుపతి జిల్లా రూరల్ మహిళ అధ్యక్షురాలు కాకుమాని సావిత్రి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు


