విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాయుడుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు.తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్,లక్ష్మీ దంపతులు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కి చీర, పసుపు కుంకుమలను అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్,గౌరవ అధ్యక్షులు పెసల జయరాజ గోపాల్,ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ఆర్యవైశ్య మహిళలకు చీరా పసుపు కుంకుమలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్,గౌరవాధ్యక్షులు పెసల జయరాజ గోపాల్ లు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సముదాయంలో జరిగిన కుంభాభిషేక మహోత్సవంలో కోలాట ప్రదర్శనలో ప్రతిభ కనబరిచడం తోపాటు, ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆర్యవైశ్య మహిళలకు విజయదశమి సందర్భంగా చీరా, పసుపు కుంకుమలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ నాయకులు, నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి యువజన సమాఖ్య సభ్యులు నాయకులు పాల్గొన్నారు.



