వాసవీ ఫౌండేషన్ గ్లోబల్ కార్యదర్శి శ్రీమతి శ్వేత గంజాం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ నిత్యాన్న సత్రం, ఆలంపురంలో శ్రీ వాసవీ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 13, 14వ తేదీన జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక హసన్ జిల్లానుండి ప్రముఖ గాయనీమణి, రాజోత్సవ గ్రహీత మరియు వైశ్యలైమ్ లైట్ అవార్డు గ్రహీత శ్రీమతి వాణీనాగేంద్రగారు, గంగావతి నుండి ప్రముఖ గాయనీ మణి గాన కోకిల అవార్డ్ గ్రహీత శ్రీమతి గిరిజా నవీన్ గారు, మంత్రాలయం శ్రీ విజయరాయ భక్త అవార్డు గ్రహీత ప్రముఖ గాయని శ్రీమతి సుధామురళిగారితో పాటు ప్రముఖ గాయనీమణులు వాసవీ సిస్టర్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసి అనేక కార్యక్రమాలను, నృత్య ప్రదర్శనలను స్థానికులతో ఆడిపాడి అలరించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన వాసవీ సిస్టర్స్ ను, శ్రీమతి శ్వేత గంజాం గార్లను ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు శ్రీ రమేష్ గుప్త గారు కళాకారులను, వాసవీ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలను విచ్చేసిన వారికి వివరించి తగురీతిని సత్కరించారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలను మిత్రులకోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం.








