కోమలమ్మ పీఠం గురించి క్లుప్తంగా….
Brief About Komalamma Peetam
100 సంవత్సరాల క్రితం, శ్రీమతి కోమలమ్మ గారు తిరుపతి యాత్రకు వచ్చి, ఆ దివ్య వాతావరణంతో ప్రేరణ పొంది, యాత్రికులకు ఉచిత అన్నదానం, విశ్రాంతి సదుపాయం అందించే ధర్మసత్రం నిర్మించాలని సంకల్పించారు. ఆమె సేవాభావం, దాతృత్వం నేటికీ వాసవీ ఫౌండేషన్ ద్వారా కోమలమ్మ పీఠం రూపంలో వెలుగులోనికి వస్తుంది.
ఈ స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ప్రతి వాసవీ అసోసియేషన్‌ను ఒకే వేదిక పైకి తీసుకురావాలని కోమలమ్మ పీఠం ఒక మంచి/గొప్ప ప్రాజెక్టు తలపెట్టాము. మన సమాజంలోని అన్ని సంఘాలు, సంస్థలు పరస్పరం అనుసంధానమై, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
మీ అసోసియేషన్‌ను ఉచితంగా నమోదు చేసుకోండి
మీ వాసవీ అసోసియేషన్ ఈ నాలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా, దిగువ ఇచ్చిన డేటాబేస్‌లో మీ వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా స్వచ్ఛంద నమోదు — ఎలాంటి రుసుము లేదు.
నమోదు చేసుకోవడం ద్వారా లభించే ప్రత్యేక అవకాశం
ప్రతి సంవత్సరం శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన చక్ర స్నానం రోజున, తిరుమల నుండి స్వామివారు గజవాహనంపై అమ్మవారికి సారె సమర్పించడానికి వేంచేస్తారు. ఈ పవిత్ర ఘట్టంలో — గజవాహనంతో పాటు అలిపిరి నుండి కోమలమ్మ సత్రం వరకు, అక్కడి నుండి స్థానిక ఆలయ దర్శనం ద్వారా తిరుచానూరు చేరుకుని — నమోదైన ప్రతి అసోసియేషన్ పాల్గొని, మన అమ్మకు మన సారెను స్వామివారి సారెతో పాటుగా సమర్పించుకునే అరుదైన అవకాశం లభిస్తుంది.
దిగువ నమోదు చేసుకోండి



































